60 లీటర్లు నాటుసారా స్వాధీనం… మహిళ అరెస్ట్
ఓ మహిళ నుండి 60లీటర్లు నాటుసారా స్వాధీనం చేసుకున్న సంఘటన సోమవారంనాడు చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే పొదిలి మండలం గోగినేనివారిపాలెంలో నాటుసారా అమ్మతున్న సమాచారం అందుకున్న అబ్కారి శాఖ అధికారులు ఆకస్మిక దాడిచేసి ఆ మహిళ నుండి 60లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని ఒక మహిళను అరెస్ట్ చేసినట్లు సిఐ వెంకట్రావు ఒక ప్రకటనలో తెలిపారు.