రైస్ మిల్ పై విజిలెన్స్ అధికారులు దాడులు రేషన్ బియ్యం పట్టివేత

పొదిలి పట్టణం మార్కాపురం క్రాస్ రోడ్ లోని ధనలక్ష్మి రైస్ మిల్ పై మంగళవారం నాడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు.

దాడుల్లో అక్రమంగా నిల్వ ఉన్న 600 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకొని స్థానిక పౌరసరఫరాల గిడ్డంగులకు తరలించిన మాల్ యాజమాని గొళ్ల సురేష్ పై పొదిలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ తహశీల్దారు షేక్ సాజిదా ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ దాడుల్లో వ్యవసాయ శాఖ అధికారి సంగమేశ్వర రెడ్డి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో యస్ఐ వెంగళ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు