70లీటర్ల నాటుసారా స్వాధీనం…. 4600 లీటర్లు బెల్లంఊట ధ్వంసం….
4600లీటర్లు బెల్లంఊట ధ్వంసం చేసి 70 లీటర్లు నాటుసారా స్వాధీనం చేసుకున్న సంఘటన మంగళవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే పొదిలి ఎక్సైజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని గోగినేనివారిపాలెం నందు నాటుసారా తయారు చేస్తున్నారనే పక్కా సమాచారంతో ఒంగోలు అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస చౌదరి టాస్క్ ఫోర్స్ యస్ఐ వీరేంద్ర సారధ్యంలోని బృందం నాటుసారా బట్టిపై చేసిన దాడుల్లో 4600లీటర్ల బెల్లంఊటను అక్కడికక్కడే ధ్వంసం చేసి తయారు చేసి ఉంచిన 70లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని…..
ఒకరిని అదుపులో తీసుకోగా మరో ఇద్దరు పరార్ అయినట్లు అధికారులు తెలిపారు.