కోటి 71 లక్షలతో మున్సిపల్ అభివృద్ధి పనులు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి నగర పంచాయితీ నందు వివిధ అభివృద్ధి పనులు నిమిత్తం ఒక కోటి 71 లక్షల 52 వేల 554 రూపాయలతో నిధులు కేటాయింపులు చేసినట్లు పొదిలి నగర పంచాయితీ కమిషనర్ డానియల్ జోసప్ శని వారం నాడు తనను కలిసిన విలేఖరులతో తెలిపారు
వివరాల్లోకి వెళితే పొదిలి నగర పంచాయితీ వార్షిక అభివృద్ధి ప్రణాళిక (ఎడిబి) ప్రకారం సిసి డ్రైన్లు, నీటి సరఫరా పైప్ లైన్లు, శానిటేషన్ కోసం ట్రాక్టర్ మరియు పరికరాలు కోనుగోలు, రోడ్లు వెంట పచ్చదనం కోసం చెట్లు పెంపకం, ట్రాఫిక్ ఐలెండ్ ఏర్పాటు మొదలైన అభివృద్ధి పనులకు ఇంజనీర్-ఇన్-చీఫ్ (పబ్లిక్ హెల్త్), తాడేపల్లి వారి అనుమతులు మంజూరు చేసారని టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు
ఈ సమావేశంలో ఇంజనీర్ రవీంద్రుడు తదితరులు పాల్గొన్నారు