పట్టణంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు….
పట్టణంలోని పలు ప్రాంతాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే 73వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలలో అలాగే పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలలలో వేడుకలు నిర్వహించి జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు.
పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు జడ్జి ఎస్ సి రాఘవేంద్ర, అలాగే స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ ప్రభాకరరావు, పొదిలి పోలీసు స్టేషన్ నందు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్, మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ, వ్యవసాయ శాఖ కార్యాలయంలో మరియు గ్రామ పంచాయతీ కార్యాలయంలో వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాసులురెడ్డి అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, గ్రామీణ నీటి సరఫరా కార్యాలయం, వెలుగు, వ్యవసాయ మార్కెట్ కమిటీ, పశుసంవర్ధక శాఖ, ఆబ్కారీ శాఖ, మరియు పలు శాఖల కార్యాలయాలు, పలు ప్రభుత్వ పాఠశాలల నందు అధికారులు జెండాను ఆవిష్కరించి జెండావందనం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో పలు శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.