స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించని నీటిపారుదల శాఖ, గృహ నిర్మాణ శాఖలు….
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించని నీటిపారుదల శాఖ, గృహ నిర్మాణ శాఖలు….
పట్టణంలో పలుచోట్ల అంగరంగ వైభవంగా 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహిస్తుంటే…. పట్టణంలోని నీటి పారుదల శాఖ మరియు గృహ నిర్మాణ శాఖల కార్యాలయాల అధికారులకు మాత్రం జెండాను ఎగురవేసే తీరిక లేకుండా పోయింది.
వివరాల్లోకి వెళితే స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని దేశమంతా పండగ వాతావరణంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, విద్యాలయాల్లో, స్వచ్ఛంద సంస్థలలో వేడుకలు నిర్వహించుకుంటుంటే…… పట్టణంలోని నీటిపారుదల శాఖ, గృహనిర్మాణ శాఖ అధికారులు మాత్రం ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
స్వాతంత్ర్య మరియు గణతంత్ర దినోత్సవాలలో అధికారులు వేరే ప్రాంతంలో జెండావందనం చేయాల్సి వచ్చినా కూడా ఖచ్చితంగా ఆయా కార్యాలయాల ఇన్ఛార్జ్ లు కానీ కార్యాలయంలోని అధికారులు కానీ జెండాను ఆవిష్కరించాల్సి ఉండగా జెండాను అవిష్కరించకపోగా కనీసం కార్యాలయాలు కూడా తెరవకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా తెలుస్తోంది.