7,8,9తరగతులకు ఇంజినీరింగ్ విద్యపై అవగాహనా సదస్సు నిర్వహించిన వాషింగ్టన్ విద్యార్ధిని…
7,8,9తరగతులకు ఇంజినీరింగ్ విద్యపై వాషింగ్టన్ డీసీ నందు ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధిని షేక్ తహసీన్ అవగాహనా సదస్సు నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే లాల్ ఫౌండేషన్ ఛైర్మన్ ఎంఏ ఖయ్యుం మనవరాలు అయిన షేక్ తహసీన్ అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నందు ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తూ తన స్నేహితులతో కలిసి ఒక గేమింగ్ రోబోట్ ను తయారు చేశారు.
తన కళాశాల ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ లోని విద్యా వ్యవస్థపై పరిశోధనలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలనందు 7,8,9,తరగతుల పిల్లలకు ఇంజనీరింగ్ మరియు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి ప్రొజెక్టర్ ద్వారా వివరించి…… ఇంజనీరింగ్ విద్యలో సమస్యలను కనుక్కోవడం వాటి గురించి అధ్యయనం చేయడం పరిష్కారానికి మార్గాలు వంటి విషయాలను ప్రొజెక్టర్ ద్వారా విద్యార్థులకు వివరించారు.
అమెరికాలో జరగబోయే ప్రపంచ రోబోటిక్స్ సదస్సులో తమ టీమ్ సభ్యులతో కలిసి వారు తయారు చేసిన రోబోను ప్రదర్శించనున్నట్లు ఆమె తెలిపారు.