పౌల్ట్రీ పై కుక్కలు దాడి 800 వందలు నాటుకొళ్ళు మృతి
పౌల్ట్రీ పై కుక్కలు దాడి 800 వందలు నాటుకొళ్ళు మృతి చెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణంలోని దరిశి రోడ్ లో ఉన్న శ్రీ లక్ష్మి నరసింహ పౌల్ట్రీ పై శనివారం అర్ధరాత్రి కుక్కల గుంపు పౌల్ట్రీ లో చొరబడి నాటుకొళ్ళుపై దాడి చేయడం 800 వందల పైగా నాటుకొళ్ళు మృతి చెందాయి.
పౌల్ట్రీ యాజమాని తోట మొహన్ కధనం మేరకు ఇటివలే నాలుగు నెలల క్రితం పౌల్ట్రీ ప్రారంభించమని ఇంకొక వారం 10 రోజులలో కొళ్ళు అమ్మకానికి వచ్చేవని అంతలో ఇటువంటి సంఘటన జరగడంతో తీవ్రంగా నష్టపొయానన్నాడు.
నాటు కొళ్ళకు మార్కెట్ బాగావుందని దాదాపు 3లక్షలమేర నష్టపొయినట్లు బాధితుడు తెలియజేసాడు.
ప్రభుత్వం నన్ను ఆదుకొవాలని,నష్ట పరిహరం అందించి నాకు చేయుతను ఇవ్వాలని బాదితుడు విజ్ఞప్తి చేసాడు.