ఆటో బోల్తా తప్పిన పెను ప్రమాదం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి మండలం పోతవరం సమీపంలో ఆటో బోల్తా పడిన సంఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది
వివరాల్లోకి పొదిలి పట్టణం చెందిన వ్యక్తులు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో కొద్ది నిమిషాల ఇంటికి చేరుకునే సమయానికి హటాత్తుగా ఆటో బోల్తా కొట్టడంతో ఆటో ప్రయాణం చేస్తున్న వారు తీవ్రంగా గాయపడ్డాడు.
గాయపడిన వారిని 108 వాహనం ద్వారా పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
పొదిలి పట్టణం కు చెందిన నాగవర్ధిని, వేణు బాబు, సోమేశ్వరం, వెంకాయమ్మ, చిన్నారులు లాస్య అజిత లు గాయపడ్డారు.
ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు.