కమల్ హాసన్ పై కోర్టులో క్రిమినల్ కేసు నమోదుకు పిల్……
మక్కల్ నీతి మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ కు వ్యతిరేకంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ డిల్లీ పాటీలా హౌస్ కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు.
వివరాల్లోకి వెళితే తమిళనాడు శాసనసభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కమల్ హాసన్ మాట్లాడుతూ గాడ్సే తొలి హిందూ ఉగ్రవాది అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే…..
కాగా కమల్ వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఏదుర్కోకుంటున్న నేపధ్యంలో పాటిలా హౌస్ కోర్టు నందు కేసు నమోదు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది.