క్రైస్తవ మత బోధకుడి ముసుగులో లక్షలాది రూపాయలు స్వాహా చేసిన నైజీరియా ముఠా

డిల్లీలో వలపన్ని పట్టుకున్న పొదిలి పోలీసులు

క్రైస్తవ మత బోధకుడి ముసుగులో లక్షలాది రూపాయలు స్వాహా చేసిన నైజీరియా ముఠాను పొదిలి పోలీసులు డిల్లీలో వలపన్ని పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే నైజీరియా దేశానికి చెందిన ఒయంకో హైజినస్ అలియాస్ పీటర్ డానియల్ తన వీసా కాలం ముగిసినా భారత్ లో ఉండడంతో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన అనంతరం తీహార్ జైలులో రెండు సంవత్సరాలు శిక్ష అనుభవించి… విడుదలై టి బి జాషువా మినిస్ట్రీస్ అనే పేరుతో నకిలీ ఫేస్ బుక్ పేజి ఓపెన్ చేసి అనేక సిమ్ కార్డులను మారుస్తూ అమాయకులను మోసం చేస్తు వారి కుటుంబ సభ్యులకు ప్రార్థన చేస్తామని నమ్మించసాగడు.

ఈ క్రమంలో పొదిలి బాప్టిస్ట్ పాలెంకు చెందిన వేల్పుల అచ్చయ్య అనే ఇంజనీరింగ్ విద్యార్థి సదరు మోసగాడి ఫేస్ బుక్ పేజి ఫాలో అవ్వడం ద్వారా చాటింగ్ చేస్తుండగా…. సదరు ముద్దాయి త్వరలో భారత్ లో చర్చిలు మరియు వైద్యశాలలు నిర్మాణం కోసం 2.4 మిలియన్ డాలర్ల ( సుమారు 17 కోట్ల రూపాయలు)తో బయలుదేరుతున్నామని నీవు మాకు సహాకరిస్తే 20శాతం కమిషన్ ఇస్తామని వాట్సాప్ కాలింగ్ ద్వారా నమ్మించడంతో…….. ఈ క్రమంలో ఒక రోజు అచ్చయ్యకు ఫోన్ చేసి డిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డానని కొంత నగదు అకౌంట్ లో వేయమని అడగగా కొంత నగదు అకౌంట్ లో వేయడం జరిగింది.

తరువాత రిజర్వ్ బ్యాంక్, ఆదాయపన్ను శాఖ అనుమతులు కోసమని మొత్తం 14లక్షల 67వేలు వివిధ బ్యాంకుల అకౌంట్ లో జమ చేయించుకోవడం జరిగింది.

దానితో తాను మోసపోయానని విషయాన్ని గ్రహించి పొదిలి పోలీసులకు అశ్రయించగా పొదిలి పోలీసులు కేసు నెంబర్ 8/2020 సెక్షన్ 420 ఐపియస్, సెక్షన్ 66, 66(డి) ఐటి యాక్టుల క్రింద కేసు నమోదు చేసి పొదిలి సిఐ శ్రీరామ్ దర్యాప్తు ప్రారంభించి అనేక సాంకేతిక ఆధారాలు సేకరించి కొనకనమిట్ల యస్ఐ నాయక్ ఆధ్వర్యంలో షేక్షావలి, శివ, వీరరాజు, డిల్లీలో మకాం వేసి డిల్లీ క్రైం పోలీసులు సహకారంతో ముద్దాయిలైన ఒయంకో హైజియనస్ అలియాస్ పీటర్ డానియల్, రెండువ ముద్దాయి షాహిద్ ఖాన్ మూడవ ముద్దాయి మొహమ్మద్ యాకబ్,లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, 9 ఎటియం కార్డులు, 22 చెక్ బుక్ స్వాధీనం చేసుకొని వారి పౌరసత్వ కార్డులు చేసుకుని ఒంగోలు తరలించినట్లు జిల్లా యస్పీ సిద్దార్థ్ కౌశల్ యస్పీ కార్యాలయంలో మంగళవారంనాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.

అనంతరం జిల్లా ఎస్పీ సిద్ధార్ద్ కౌశల్ మాట్లాడుతూ పొదిలి ఎస్ఐ సురేష్, కొనకనమిట్ల ఎస్ఐ నాయక్, షేక్షావలి, శివ, వీరరాజు లకు రివార్డును ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో దరిశి డీయస్సీ ప్రకాష్ రావు, పొదిలి సిఐ శ్రీరామ్, పొదిలి కొనకనమీట్ల యస్ఐలు సురేష్, వెంకటేశ్వర నాయక్, కానిస్టేబుల్స్ శివ, షేక్షావలి, వీరారాజు, ప్రవీణ్, నాయక్, తదితరులు పాల్గొన్నారు.