అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులకొట్టిన వారిపై పోలీసులకు పిర్యాదు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తలపెట్టిన సమ్మె ఐదో రోజుకు చేరింది
ఐదవ రోజు స్ధానిక పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నుంచి పోలీసు స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
అంగన్వాడీ కేంద్రాలను అక్రమంగా దౌర్జన్యంగా పగల కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు పొదిలి పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు
ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు శోభా మాట్లాడుతూ తక్షణమే అంగన్వాడీ కేంద్రాలను పగల కొట్టిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం రమేష్ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు శోభా మరియు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తదితరులు పాల్గొన్నారు