వీర సైనికులకు ఘన నివాళి
ఇండియా-చైనా సరిహద్దులో చైనా దొంగదెబ్బను తిప్పి కొట్టడంలో అమరులైన సైనికులకు ఘనంగా నివాళులర్పించారు.వివరాల్లోకి వెళితే ఇండియా-చైనా సరిహద్దు ప్రాంతమైన లడఖ్ లోని గాల్వాన్ లోయలో అక్రమంగా ఇండియాను అక్రమించే చైనా ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో జరిగిన ఘర్షణలో అమరులైన సైనికులకు కేబుల్, లోకల్ మరియు యూట్యూబ్ ఛానెల్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక పెద్దబస్టాండ్ సెంటర్ నందు వీరసైనికుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జోహార్ నినాదాలతో ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పేరూ శ్రీనివాసులు, ముల్లా సుల్తాన్ మోహిద్దీన్, పందిటి సునీల్, కె బి షాహిద్, షేక్ కాలేషా, బి లక్ష్మీ, వీర చంద్రశేఖర్, మాచర్ల యరగొర్ల, సురేష్, మచ్చా రమణయ్య, షేక్ రసూల్, అనిల్, శివ తదితరులు పాల్గొన్నారు.