8 రోజుల నుంచి అంధకారంలో ఉన్న ఓ గ్రామం పొదిలి టైమ్స్ ప్రత్యేక కధనం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
సహజంగ ఈ మధ్యకాలంలో ఏర్పడుతున్న కరెంట్ కొతలకు ప్రజలు ఒక్కరి బిక్కిరి అవుతుంటే ఏకంగా 8 రొజులుగా పూర్తిగా అందంకారంలో ఓగ్రామం ఉండిపొయింది. కనీసం సెల్ ఫొన్స్ ఛార్జింగ్ పెట్టుకొవలన్న పక్క గ్రామానికి వెళ్ళవలసిన పరిస్థితి నెలకొంది. అటు నాయకులుగాని,ఇటు అధికారులు గాని పట్టించుకొక పొవడంతో దిక్కుతొచని స్థితిలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
ప్రకాశంజిల్లా పొదిలి మండలం రాములవీడు గ్రామం గత 8 రొజులుగా పూర్తిగా అందంకారంలో ఉండిపొయింది. ఇటివల కాలంలో కురిసిన గాలివాన కు కరెంట్ స్తంభాలు పడిపొవడంతో కరెంట్ నిలిచిపొయింది. అధికారుల దృష్టికి తీసుకెళ్తే విద్యుత్ లైన్ కు అవసరమైన సామాన్లు బయటినుంచి కొనితేస్తే మరమ్మతులు చేస్తామని తెల్చి చెప్పారని ఆసామాను 15 వేల నుంచి 20 వేల దాకా ఖర్చు అవుతుందని ఇంటింటికి కొంత నగదు సేకరించిన అధికారులు ముందుకు రావడంలేదని గ్రామస్తులు ఆరొపిస్తున్నారు.
విద్యుత్ నిలిచిపొవడంతో చంటి బిడ్డలు,వృద్దులు నాన అవస్తలు పడుతున్నారు. గ్రామంలో సాప్ట్వేర్ ఉద్యొగులు పక్క గ్రామాలకు వెళ్ళి తమ ల్యాప్ ట్యాప్ లకు ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు.
కనీసం స్నానానికి నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ లైన్ మరమ్మత్తులకు మేము సామాను కొని తీసుకురావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మాగ్రామానికి విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని లేకపొతే విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు