బిసిల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి : జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నూకసాని బాలాజీ
వెనుకబడిన తరగతుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు.
వివరాల్లోకి వెళితే శనివారంనాడు స్థానిక రోడ్లు మరియు భవనముల అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నుకసాని బాలాజీ మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బిసిల సంక్షేమం కోసం ఎంతో ఖర్చు చేశారు అనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేస్తే మీరు చేసిన అభివృద్ధి ఏమిటి అనేది ప్రజలకు అర్థం అవుతుందని….. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం బిసి సబ్ ప్లాన్ ఎంబిసి కార్పోరేషన్ మరియు వివిధ 35కులాలకు చెందిన కార్పోరేషన్లను ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్న కార్పోరేషన్లను రద్దు చేయడం తప్ప చేసింది ఏమీ లేదని…..
అదే విధంగా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రతి కులానికి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీలను అమలు చేయాలని వాటి నిధులు కేటాయించాలని…… అలాగే ప్రభుత్వం తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని బిసి సబ్ ప్లాన్ ద్వారా బిసి సంక్షేమం కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు పొల్లా నరసింహ యాదవ్, మూరబోయిన బాబురావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు