శరన్నవరాత్రులకు ఆలయాల ముస్తాబు

దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆలయాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు అమ్మవారి విగ్రహాలను ఆయా మండపాలకు భక్తులు తరలించారు. పట్టణంలోని పార్వతిసమేత నిర్మమహేశ్వర స్వామిదేవస్థానం, శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవాలయం, పొదిలమ్మ దేవస్థానం, జ్వాలాముఖీ దేవస్థానం, పోలేరమ్మ దేవస్థానం, మహాలక్ష్మీ దేవస్థానం, తదితర దేవాలయాలు అంగరంగ వైభవంగా తిర్చిద్దిద్దారు. తొలిరోజు అయిన బుధవారం దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తూనేటి నుండి వైభవంగా దసరా మహోత్సవములు ప్రారంభించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయా దేవస్థాన కార్యనిర్వాహక కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.