ఆర్యవైశ్య పేదలకు అండగా ఉంటా: కుప్పం ప్రసాద్
ఆర్యవైశ్య పేదలకు అండగా ఉంటానని ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ అన్నారు. వివరాలు లోకి వెళ్ళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్మన్ పదవి ఎంపికైన తరువాత తొలిసారిగా పొదిలి వచ్చిన సందర్భంగా తనను కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ పొదిలి పట్టణంలో 99రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇస్తానని హామీ ఇచ్చారని ఆ హామీ నేడు నేరవేర్చారని ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.