అభ్యర్థి ఎంపికలో వేగంగా పావులు కదుపుతున్న జనసేన
జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గం అభ్యర్ధి ఎంపికలో పార్టీ అధిష్టానం వేగంగా పావులు కదపడం ప్రారంభించింది. నియోజకవర్గంలో అధికశాతం ఓటర్లు కలిగిన యాదవ సామాజిక వర్గం నుండి లేకపోతే వైశ్య సామాజిక వర్గం నుండి అభ్యర్థిని ఎంపిక చేసే దిశగా పావులుకదుపుతూ ఈ విషయంపై నియోజకవర్గంలోని కొంతమంది నాయకులతో పార్టీ అధిష్టానం చర్చలు జరిపినట్లు సమాచారం….. వారితోపాటు మరో ఇద్దరు జడ్పీటిసి సభ్యులతో కూడా జనసేన పార్టీ అధిష్టానం చర్చలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం…….ఏదేమైనా నెల ఆఖరులోగా నియోజకవర్గంలో గట్టి పోటీనిచ్చే అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో జనసేన పార్టీ అధిష్టానం మంతనాలు ముమ్మరం చేసిందని చెప్పవచ్చు…… ఇకపోతే పార్టీ అధిష్టానం టికెట్ ఎవరికి కేటాయిస్తుంది అనేది తెలియాలంటే కొంచెం వేచిచూడాలి.