అదుపుతప్పిన ద్విచక్ర వాహనం చెట్టుకు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారంనాడు చోటుచేసుకుంది.
దొనకొండ మండలం గంగదేవిపల్లి గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ గోపిరెడ్డి (22) పొదిలి నుండి దరిశి వెళ్తుండగా మల్లవరం-కుంచేపల్లి మధ్యలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో మృతి చెందగా సంఘటనా స్థలానికి చేరుకున్న పొదిలి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వం వైద్యశాలకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.