ట్రాక్టర్ ద్విచక్ర వాహనం ఢీ… ఒకరికి గాయాలు

ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు గాయపడిన సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే మాదాలవారిపాలెం గ్రామానికి చెందిన గోనుగుంట్ల నరేష్ మరో వ్యక్తి కలిసి పొదిలి వైపు వస్తుండగా….. ఆక్స్ ఫర్డ్ విద్యాసంస్థ సమీపంలోని ఫ్లైయాష్ బ్రిక్స్ వద్ద ట్రాక్టర్ మరియు ద్విచక్ర వాహనం పరస్పరం ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తున్న నరేష్ తీవ్రంగా గాయపడగా మరో యువకుడు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు.

గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.