హత్య కేసులో ముద్దాయి అరెస్టు : సిఐ సుధాకరరావు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
హత్య కేసులోని ముద్దాయిని అరెస్టు చేసినట్లు పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ యు సుధాకర్ రావు సోమవారం నాడు ఒక ప్రకటన లో తెలిపారు.
వివరాల్లోకి వెళితే కొనకనమిట్ల మండలం గొట్లగట్టు గ్రామం నందు ఏప్రిల్ 16వ తేదీ తెల్లవారుజామున హత్య కు గురైన హరికృష్ణ కేసులోని ముద్దాయి కొప్పుల నరేంద్ర రెడ్డి అలియాస్ నాని ఆది వారం నాడు స్థానిక గొట్లగట్టు గ్రామ రెవెన్యూ అధికారి ద్వారా లొంగిపోగా అతని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం పొదిలి కోర్టులో హాజరు పరిచినట్లు గా సిఐ సుధాకరరావు ఒక ప్రకటనలో తెలిపారు