అగ్రహారం సమీపంలో స్పిరిట్ ట్యాంకర్ బోల్తా
పొదిలి మండలం అగ్రహారం దగ్గర ఒంగోలు కర్నూల్ జాతీయ రహదారిలో ప్రమాదం చోటుచేసుకుంది కర్ణాటక రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ ఒంగోలు వస్తున్న స్పిరిట్ లారీ డ్రైవర్ ఒక్కసారిగా నిద్రమత్తులో ఉండటంతో స్పిరిట్ ట్యాంకర్ బోల్తా పడిన సంఘటన చోటుచేసుకుంది సుమారు కొన్ని గంటలపాటు తీవ్ర ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో పోలీసులు వాహనాలను పొలాలలో నుండి వెళ్లేలా చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజన్ నీటితో స్పిరిట్ ట్యాన్కర్ పై జల్లుతూ ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసారు సంఘటన స్థలాన్ని సిఐ చిన్న మీరాసాహెబ్ మరియు యస్సై శ్రీరాం లు దగ్గర ఉండి ఎటువంటి ప్రమాదం లేకుండా చేసారు స్థానికుల సహాయంతో స్పిరిట్ ట్యాన్కర్ క్రైన్ ల ద్వారా పైకి లేపారు కార్యక్రమంలో పాల్గొన్న స్థానికులను పోలీసులు అభినందించారు.