లక్ష్యాన్ని మించి ఆదాయాన్ని ఆర్జించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ
త్వరలో మార్కెట్ కమిటీ ప్యానల్ కమిటీ ఏర్పాటు
వ్యవసాయ మార్కెట్ కమిటీ అదనపు కార్యదర్శి మస్తాన్ రావు వెల్లడి
పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ లక్ష్యాన్ని మించి ఆదాయాన్ని ఆర్జించిందని వ్యవసాయ మార్కెట్ కమిటీ అదనపు కార్యదర్శి మస్తాన్ రావు తెలిపారు.
వివరాల్లోకి వెళితే సోమవారం నాడు స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం నందు తనను కలిసిన విలేఖరులతో అదనపు కార్యదర్శి మస్తాన్ రావు మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరం 70 లక్షల రూపాయలు లక్ష్యంగా పెట్టుకొని ఒక కోటి 20 లక్షల రూపాయలు ఆదాయాన్ని ఆర్జించిందని అందులో అధిక భాగం కంది పంట ద్వారా వచ్చిందని ఈ ఆర్థిక సంవత్సరం కంది పంట దిగుబడి తగ్గిపోవటం వల్ల ఆదాయం కొల్పోడం జరుగుతుందని తెలిపారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవి కాలం మార్చి 23 తేదీ తో ముగించిందని ఎవరికి ఇన్చార్జ్ బాధ్యతలు ఇవ్వలేదని ఇటివల జిల్లా కలెక్టర్ చైర్మన్ ప్యానల్ ను అడిగి ఉన్నారు సదరు అంశాన్ని శాసనసభ్యులు దృష్టి తిసుకొని వెళ్లమని తెలిపారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనాలకు కోసం కేటాయించిన స్థలంలో 60 లక్షల రూపాయలు తో ప్రహారీ గోడ నిర్మాణం పూర్తి అయ్యిందని నూతన భవనాల నిర్మాణం కోసం రెండు నెలల్లో నిధులు మంజూరు ప్రక్రియ పూర్తి కాగానే పనులు ప్రారంభిస్తామని తెలిపారు