మార్కెట్ కమిటీ చైర్మన్లుగా ఎమ్మెల్యేలు
వివరాల్లోకి వెళితే ఇప్పటికే పలు సంస్కరణలు వైపు దృష్టి పెట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వ్యవసాయ శాఖ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలపై దృష్టి పెట్టారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు పరోక్షంగా ప్రభుత్వం నియమిస్తూ ఉండడంవలన వారికి రైతులపై పట్ల ప్రత్యేక శ్రద్ధ లేకపోవడం రైతులకు గిట్టుబాటు ధర అలాగే మౌలిక వసతులు కల్పించడంలో విఫలం అవుతున్నారని…… అదేవిధంగా మార్కెట్ కమిటీ నిధులు కూడా సరైన రీతిలో వినియోగం చేయడంలో స్వలాభానికి పాల్పడడం….. రైతులకు జవాబుదారులుగా లేకపోవడం వలన ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించారని సమాచారం.
ప్రజలచేత ఎంపికైన ప్రజాప్రతినిధి అయితే బాగుంటుందని అందులో భాగంగా స్థానిక శాసనసభ్యులనే చైర్మన్ గా నియమిస్తే రైతుల పట్ల జవాబుదారీతనం ఉంటుందని భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తుందని త్వరలోనే సంబంధించిన విధివిధానాలును ప్రభుత్వం విడుదల చేస్తుందని సమాచారం.