అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీ రిలే నిరహారదీక్షలు ప్రారంభం

అగ్రిగోల్డ్ బాధితుల రాష్ట్రవ్యాప్త నిరసనలో భాగంగా పొదిలి మండల కేంద్రంలో ఉదయం 100 మందితో ర్యాలీ నిర్వహించి న్యాయం బాధితులకు వెంటనే డబ్బులు చెల్లించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ ని పెద్ద బస్టాండ్ చిన్న బస్టాండ్ ఎంఆర్ఓ ఆఫీస్ వరకు చేశారు. తరువాత ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణం లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు ఈ కార్యక్రమం లో యస్ నాగేశ్వరవు కె ప్రసాద్ ఎ శ్రీనివాసులు ఎంవి సుబ్బారావు వి సురేష్ బి హనుమంతు సిపియం నాయకులు రమేష్ సిపిఐ నాయకులు ఏసురత్నం పేదల పార్టీ నాయకులు యుద్ధం నరసింహరావు పాల్గొన్నారు