భక్తుల సౌకర్యార్థం ఎయిర్ కండిషనర్ అమరిక : ఈఓ చంద్రశేఖర్
పొదిలి నిర్మమహేశ్వరస్వామి దేవస్థానం గర్భగుడి నందు ఎయిర్ కండిషనర్లు అమరిక కోసం మరమ్మతులు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా దేవస్థాన కార్యనిర్వాహణ అధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం నిర్మమహేశ్వరస్వామి దేవస్థానం గర్భగుడిలో ఎయిర్ కండిషనర్ల అమర్చడానికి శుక్రవారంనాడు పనులు ప్రారంభం అయ్యాయి కార్తీకమాసం ప్రారంభం అయ్యేలోగా పనులు పూర్తిచేసే విధంగా మరమ్మతులను వేగవంతం చేస్తామని అన్నారు. ఈ ఎయిర్ కండిషనర్లను కారంశెట్టి మధుసూదన్ బహుకరిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా కార్తీకమాసం ప్రారంభం అయ్యేలోగా దాతల సహకారంతో ఆలయంలో కొన్ని హంగులతో మార్పులు చేయడానికి దాతలను సహకారం కోరామని దాతలు కూడా ముందుకు వస్తున్నారని త్వరలోనే నూతన హంగులతో ఆలయంలో మార్పులు జరగనున్నాయని ఈఓ చంద్రశేఖర్ పొదిలి టైమ్స్ కు తెలిపారు.