ఎఐటియుసి ఆధ్వర్యంలో రాస్తారోకో…. మనవహారం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజావ్యతిరేక విదానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రికసమ్మె రెండవ రోజు ఎఐటియుసి ఆధ్వర్యంలో పెద్ద బస్టాండ్ నందు రాస్తారోకో మనవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు గుజ్జుల బాలిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరించేలా కార్మికచట్టాల సవరణకు పూనుకోవడం దారుణమైన చర్య అని కార్మికులందరికి కనీస వేతనాలు అమలుచేసి ఉపాధి భద్రత కల్పించాలని అసంఘటితరంగ కార్మికుల సామాజికభధ్రతకు సమగ్రచట్టం రూపొందించాలని స్కీమ్ వర్కర్స్ రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు షేక్ గౌస్, షేక్ అల్లాభక్షు, బండి వెంకటేశ్వర్లు, షేక్ జిలానీ, తదితరులు పాల్గొన్నారు.