అఖిల భారత యాదవ మహా సభ ఆధ్వర్యంలో కొనకనమీట్ల మండల తాహాసిల్థార్ గారికి వినతిపత్రం
యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయలని కోరుతూ అఖిల భరత యాదవమహసభ ఆద్వర్యం లో కొనకనమీట్ల మండల తహాశీల్ధార్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా అఖిల భరత యాదవ యువజన మహసభ జిల్లా అధ్యక్షులు మందగిరి వెంకటేష్ యాదవ్ మాట్లాడుతు ఆంధ్రప్రదేశ్ లో యాదవుల, బిసీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, యాదవులకు, బిసిలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి యాదవ సామాజిక వర్గమునకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మేలు చేయాలని, ఆంధ్ర ప్రదేశ్ లో 17 శాతం ఉన్న యాదవుల సంక్షేమం కోసం యాదవ కార్పోరేషన్ ఏర్పాటు చేసి 2500 కోట్లు వెచ్చించాలని, గొర్రెల కాపరులకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలకు యూనిట్ కు ఋణ వసతీ కల్పచాలని, పశు కాపరులకు 10 లక్షల వ్యక్తిగత ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలి అన్నారు జిల్లా ఉపాధ్యక్షులు పోల్లా నరసింహ యాదవ్ మాట్లాడుతు ప్రతి జిల్లా కేంద్రంలో యాదవ విద్యార్థుల కొరకు 2ఎకరాల భూమిని కేటాయించాలి, టిటిడి చైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ ను ప్రభుత్వం నియమించి యాదవుల చారిత్రాత్మక కోరికను నెరవేర్చాలని, జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవులలో 7 మందిని బిసీలకు, అందులో 3 యాదవులకు కేటాయించాలని, కోరుచూ రాష్ర్ట ప్రభుత్వానికి కొనకనమీట్ల మండల రెవిన్యూ కార్యాలయం నందు తహాశీల్ధార్ కు యాదవమహసభ నాయకులు వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నాగం వెంకటేశ్వర్లు మండల అఖిల భారత యాదవ మహసభ నాయకులు జంబో ఏడుకొండలు మొనపాటి మురళి యాదవ్ చిట్టిబోయిన విజయకుమార్ యాదవ్ బండరు శివకుమర్ యాదవ్ రెడ్డబోయిన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు