ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎస్ఐ సురేష్
పట్టణంలోని పలు దుకాణాల్లో పొదిలి ఎస్ఐ సురేష్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే పట్టణంలోని పలు దుకాణాలలో నిషేధిత గుట్కాలు, బాణాసంచా అమ్మకాలు జరుగుతున్నాయని ఎస్ఐ సురేష్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుట్కాలు మరియు నిషేధిత వస్తువులు అక్రమంగా నిల్వ ఉంచిన బాణాసంచా అమ్మకాలు జరపడం చట్టరీత్యా నేరమని అటువంటి నిషేధిత వస్తువులను అమ్మే దుకాణదారులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందని ఆయన అన్నారు.