అక్రమ ఆన్లైన్ భూములపై సిట్ తో దర్యాప్తు జరిపించండి : సైదా
అక్రమంగా ఆన్లైన్ చేసిన భూములపై సిట్ తో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సైదా కోరారు. వివరాల్లోకి వెళితే ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్ నాగలక్ష్మిని కలిసి వినతిపత్రం అందజేశారు. మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో 3500ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కులకు కేటాయించి పేదలకు అన్యాయం చేశారని…… అక్రమంగా ఆన్లైన్ చేసిన ప్రభుత్వ భూములపై సిట్ తో దర్యాప్తు నిర్వహించి ఆ భూమిని పేదలకు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సైదా కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముక్కర ఐజక్ న్యూటన్, షేక్ బాబా ఖాదర్ వలి, ధర్నాసి సుబ్బారావు, ముల్లా జిలాని, షేక్ నాయబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు.