అక్రమంగా వేసిన వేసిన స్పీడ్ బ్రేకర్లను తొలగిస్తాం…. ఎన్డిబి సహకారంతో రోడ్లకు మహర్ధశ : ర భ స డీఇ కృష్ణ
పొదిలి మండలంలో అక్రమంగా వేసిన స్పీడ్ బ్రేకర్లను తొలగిస్తామని రోడ్లు మరియు భవనముల శాఖ డివిజన్ ఇంజనీర్ కృష్ణ అన్నారు.
వివరాల్లోకి వెళితే స్ధానిక డివిజన్ కార్యాలయంలో కలిసిన విలేకరులతో డిఈ కృష్ణ మాట్లాడుతూ న్యూ డెవలప్ బ్యాంకు (ఎన్డీబి ) వారు సర్వే నిర్వహిస్తున్నారని సర్వే పూర్తి ఆయన తరువాత రోడ్లుకు మహర్ధశ పడుతుందని అందులో భాగంగా పొదిలి-మల్లవరం వాగుపై వంతెన నిర్మాణానికి అలాగే మూసీ నదిపై నూతన వంతెనల నిర్మాణం మొదలగు ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఆయన తెలిపారు.