ఆక్రమణను అడ్డుకున్న వారిపై దాడి హేయమైన చర్య : ఇమ్మడి కాశీనాధ్
స్థానిక శివాలయం ఎదురుగా ఉన్న విశ్వబ్రాహ్మణ “ఆరామక్షేత్రం”ను కొందరు వైసీపీ నాయకులు అయ్యప్పస్వాముల ముసుగులో ఆక్రమణకు పాల్పడడం అడ్డుకున్న జనసేనపార్టీ నాయకులు శ్రీనివాస్ ను అలాగే విశ్వబ్రాహ్మణలను వారి కుల పెద్దలపై భౌతికదాడులకుదిగి అవమానించడం హేయమైన, అప్రజాస్వామిక చర్య అని జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ అన్నారు.
అయ్యప్పస్వామి గుడి అన్నదాన సత్రంకోసం స్థలం కావాలంటే భక్తులనుండి చందాల రూపంలో పోగుచేసుకుని కొనుగోలు చేసి నిర్మించుకోవాలే కానీ…. కోర్టు వివాదంలో ఉన్న భూమిని కబ్జా చేయడం మంచిపద్దతి కాదని…..
పోలీసులు నిందితులపై తక్షణమే అరెస్టు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని…… లేకుంటే రెండు రోజుల్లో జనసేన పార్టీ ధర్నాకు పిలుపునిచ్చి బాధితులకు న్యాయం జరిగేవరకు బాధితుల పక్షాన నిలబడి పోరాడతామని ఆయన ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు.