వాడవాడలో ఘనంగా అంబెడ్కర్ జయంతి వేడుకలు

మండలం పరిధిలోని పలు గ్రామాల్లో భారత రాజ్యాంగ‌ నిర్మాత‌ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

మండలం పరిధిలో యేలురు గ్రామ పంచాయతీ నందు అంబెడ్కర్ చిత్ర పటానికి మండల రెవెన్యూ తహశీల్దారు హనుమంతరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అన్నవరం గ్రామ పంచాయతీ కార్యాలయం నందు సర్పంచ్ పులి శ్రీలత అంబెడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

కుంచేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం నందు సర్పంచ్ వరికుంట్ల కాంతమ్మ ఆధ్వర్యంలో అంబెడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఆమదలపల్లి గ్రామ పంచాయతీ లో సర్పంచ్ సిరిమల్లె శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అంబెడ్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

బెల్లంకొండ విద్యాసంస్థల్లో చైర్మన్ బెల్లంకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబెడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

యుటియఫ్ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.


మండల పరిషత్ కార్యాలయంలోని అంబెడ్కర్ విగ్రహానికి మరియు ప్రాగణంలోని విగ్రహాలకు ఈఓఆర్డీ రాజశేఖర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

స్థానిక విశ్వనాథపురం లోని శ్రీ వివేకానంద విద్యా సంస్థల్లో దళిత బహుజన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు
ఆ సందర్భంగా పలువురిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దరిశి డియస్పీ ప్రకాశ్ రావు ముఖ్య అతిథిగా హాజరై అంబెడ్కర్ సేవాలను కొనియాడారు.