ఏఎంసి చైర్మన్ పందేరంలో పద్మావతి
పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి పందేరంలోకి పుల్లగొర్ల పద్మావతి అడుగు పెట్టడంతో పదవీ పందేరంలో అశవాహుల జాబితా పెరిగిపోయింది.
వివరాల్లోకి వెళితే పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవి బిసి సామాజికవర్గ మహిళ కేటాయించడంతో మండలంలోని కంభాలపాడు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ పులగొర్ల శ్రీనివాస్ యాదవ్
మరదలు పులగొర్ల పద్మావతి చైర్మన్ పదవి అశిస్తూ పదవి పందేరంలోకి అడుగు పెట్టారు.
మార్కాపురం నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 35వేలకు పైగా ఉన్నాయని…. గత శాసనసభ ఎన్నికలలో 70శాతం యాదవ ఓట్లు వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డికి వేశారాని ఆయన గెలుపులో యాదవులు క్రీయశీలక పాత్ర పోషించారని అదేవిధంగా తమ కుటుంబం వైసీపీ ఏర్పాటు నుండి మండలంలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తూ 2013లో తమ బావ పులగొర్ల శ్రీనివాస్ యాదవ్ కంభాలపాడు సర్పంచ్ గా పోటీచేసి విజయం సాధించారని…. 2014, 2019 శాసనసభ ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల విజయానికి ఎంతో కృషి చేశామని…. తమ కుటుంబం పార్టీ చేసిన ప్రతి కార్యక్రమంలో పాలుపంచుకోవడం వంటి ఎన్నో సందర్భాలు తమకు కలసివచ్చి తప్పకుండా సముచిత న్యాయం జరగుతుందని ఆశాభావం వ్యక్తంచేస్తూ చైర్మన్ పందేరంలోకి అడుబెట్టారు.