త్రిముఖపోటీలో చైర్మన్ పదివి దక్కేది ఎవరికి!
పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికై గుర్రపుశాల కోటేశ్వరి, షేక్ నుర్జహన్, పుల్లగొర్ల పద్మావతిలు ముగ్గురి మధ్య పోటీలో పదవి ఎవరికి దక్కుతుందనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
వివరాల్లోకి వెళితే పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవి బిసి సామాజికవర్గ మహిళకు కేటాయించడంతో మండల పార్టీ మాజీ అధ్యక్షులు గుర్రపుశాల శ్రీనివాసులు సతీమణి కోటేశ్వరి….. మండలంలోని కంభాలపాడు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ పులగొర్ల శ్రీనివాస్ యాదవ్
మరదలు పులగొర్ల పద్మావతి…… వైసీపీ మైనారిటీ విభాగం పార్లమెంట్ కమిటీ కార్యదర్శి మాజీ పంచాయతీ పాలకవర్గ సభ్యురాలు అయిన షేక్ నూర్జహన్ లు చైర్మన్ పదవిని అశిస్తూ పదవి పందేరంలోకి అడుగు పెట్టడంతో ముగ్గురి మధ్య తీవ్ర స్థాయి పోటీ నెలకొంది.
పొదిలి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మరియు వైసీపీ ఆవిర్భావ మండల అధ్యక్షుడు పనిచేసిన గుర్రపుశాల శ్రీనివాసులు తను పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్నానని గతంలో బిసి రిజర్వేషన్లు అయిన సర్పంచ్ మరియు జడ్పీటిసి ఎన్నికల అభ్యర్థిత్వ ఖరారు చివరి నిమిషంలో నాకు పోటీ చేసే అవకాశం దక్కలేదని ప్రస్తుతం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బిసి మహిళలకు కేటాయించారు కాబట్టి ఈ పదివి తన సతీమణికి ఇవ్వాలని శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డికి వినతి పత్రం అందజేశారు.
తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయ కుటుంబమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి తను పార్టీలో కార్యకర్తగా పనిచేస్తూ 2013లో పంచాయతీ పాలకవర్గ సభ్యురాలిగా ఎన్నికై గత ఐదు సంవత్సరాలు పంచాయతీలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కీలకపాత్ర వహించడంతో వైసీపీ మైనారిటీ విభాగం ఒంగోలు పార్లమెంట్ కమిటీ కార్యదర్శిగా ఎంపిక చేశారని తన పదవికి న్యాయం చేస్తూ పార్టీ అభ్యర్థుల విజయనికి కృషి చేశానని…..అదేవిధంగా నియోజకవర్గంలో 20వేలకు పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారని వారికి సముచిత గౌరవం, న్యాయం జరిగే విధంగా ముస్లిం మహిళ అయిన నాకు న్యాయం చేయాలని షేక్ నుర్జహన్ శాసనసభ్యులు నాగార్జున రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్ళారు.
ఇదిలావుంటే మార్కాపురం నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 35వేలకు పైగా ఉన్నాయని…. గత శాసనసభ ఎన్నికలలో 70శాతం యాదవ ఓట్లు వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డికి వేశారాని ఆయన గెలుపులో యాదవులు క్రీయాశీలక పాత్ర పోషించారని అదేవిధంగా తమ కుటుంబం కెపి కొండారెడ్డి అనుచరులుగా ఉంటూ ఆయనతోపాటు వైసీపీలో చేరామని మండలంలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తూ 2013లో తమ బావ పులగొర్ల శ్రీనివాస్ యాదవ్ కంభాలపాడు సర్పంచ్ గా పోటీచేసి విజయం సాధించారని…. 2014, 2019 శాసనసభ ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల విజయానికి ఎంతో కృషి చేశామని…. తమ కుటుంబం పార్టీ చేసిన ప్రతి కార్యక్రమంలో పాలుపంచుకోవడం వంటి ఎన్నో సందర్భాలు తమకు కలసివచ్చి తప్పకుండా సముచిత న్యాయం జరగుతుందని ఇప్పటికే కెపి కొండారెడ్డితో మరియు ఆయన తనయుడు శాసనసభ్యులు నాగార్జునరెడ్డిలతో చైర్మన్ పదవి విషయం చర్చించామని తమనే పదవి వరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ త్రీముఖ పోటీలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో కొంతకాలం వేచి చూడవలసిందే.