పొదిలి మండలం 1300 మంది తల్లులు కు షాక్

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి మండలం పరిధిలో 1300 మంది తల్లులు కు అమ్మ ఒడి అనర్హత వేటు పడింది.

పొదిలి మండలం మొత్తం 7543 మందిలో 6243 మందిని అర్హత సాధించిగా 1300 మంది అనర్హత వేటు పడింది.

పొదిలి మున్సిపల్ పరిధిలోని మొత్తం 4204 మందిలో 3225 మంది అర్హులు కాగా 979మందికి అనర్హత వేటు పడింది.

పొదిలి 1వ సచివాలయం నందు 412 అర్హులు 100 అనర్హులు పొదిలి 2వ సచివాలయం 361 అర్హులు 94 అనర్హులు పొదిలి 3వ సచివాలయం 350 అర్హులు 211 పొదిలి 4వ సచివాలయం 408 అర్హులు 178 అనర్హులు పొదిలి 5వ సచివాలయం 284 అర్హులు 147 అనర్హులు పొదిలి 6వ సచివాలయం 513 అర్హులు 112 అనర్హులు మాదాల వారి పాలెం సచివాలయం 387 అర్హులు 57 అనర్హులు కంభాలపాడు సచివాలయం 508 అర్హులు 80అనర్హులు

పొదిలి రూరల్ మండలంలో 3339 మందిలో 3018 అర్హులు 321 అనర్హులు గా గుర్తించారు.

అధిక కరెంటు బిల్లులు, ఆధార్‌ లింక్‌, కొత్తరేషన్‌కార్డు, అర్బన్ ప్రాపర్టీ మొదలైన కారణాల సాకు వల్ల అనర్హత వేటు వెయ్యటం పట్ల తల్లులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తక్షణమే ప్రభుత్వం స్పందించి తాము న్యాయం చేయాలని తల్లులు డిమాండ్ చేస్తున్నారు.