ఆజాద్ కి అమృత మహోత్సవ ర్యాలీ
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
స్వతంత్ర భారత అమృత మహోత్సవాల్లో భాగంగా ఆజాద్ కి అమృత మహోత్సవ ర్యాలీ నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే ఆదివారం నాడు స్థానిక పొదిలి మండల పరిషత్ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ మీదుగా పెద్ద బస్టాండ్ వరకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం స్థానిక పెద్ద బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్ మాట్లాడుతూ ఆజాద్ కి అమృత మహోత్సవ సందర్భంగా ప్రతి ఇంటి పై జాతీయ జాతీయ జెండాను ఎగర వేయటం ద్వారా భారతీయులు ఐక్యత ప్రపంచానికి చాటి చెప్పాలని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీకృష్ణ ఈఓఆర్డీ రాజశేఖర్, రెవెన్యూ,మున్సిపల్ సిబ్బంది మరియు అంగన్వాడీ కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.