నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్
పట్టణంలోని ఓ ఆటో డ్రైవర్ తన ఆటోలో ఓ యువతి మరచిపోయిన బ్యాగును పోలీసు వారికి తెలియజేసి పోగొట్టుకున్న యువతికి అందించి తన నిజాయితీ చాటుకున్నారు.
వివరాల్లోకి వెళితే పట్టణంలో ఆటో నడుపునే సురేష్ అనే వ్యక్తి తన ఆటోలో ప్రయాణించిన ఓ యువతి బ్యాగును మర్చిపోయిందని గుర్తించి వెంటనే స్థానిక పోలీసు ఠాణా అధికారికి తెలియజేయగా బ్యాగును మరిచిపోయిన యువతి కూచిపూడి గ్రామానికి చెందిన రాణి అనే యువతిగా గుర్తించి పొదిలి పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ మరియు ఎస్ఐ సురేష్ ల సమక్షంలో ఆటో డ్రైవర్ సురేష్ చేతుల మీదుగా బ్యాగును తిరిగి ఆ యువతికి అప్పగించినట్లు ఎస్ఐ సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆటో డ్రైవర్ సురేష్ నిజాయితీని సిఐ శ్రీరామ్, ఎస్ఐ సురేష్ లు అభినందించారు.
ఈ కార్యక్రమంలో అటో యూనియన్ అధ్యక్షులు జిలానీ మరియు యూనియన్ నాయకులు పోలీసులు తదితరులు పాల్గొన్నారు