డిల్లీ బాటలో ఆంధ్రా స్కూలు! అధ్యాయనం కమిటీ లో పొదిలి కి స్ధానం !!
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన నాడు -నేడు భాగం ప్రభుత్వం పాఠశాలలు అన్నింటినీ కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే భాగం డిల్లీ లోని ప్రభుత్వ పాఠశాలలను అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ లో పొదిలి బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు లకు స్థానం కల్పించారు.
పొదిలి బాలికల ఉన్నత పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే ప్రయత్నించి ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయి లో గుర్తింపు పొందటం కీలక పాత్ర పోషించిన ప్రధానోపాధ్యాయులు శ్రీనువాసులు ను అద్యాయన కమిటీ ఎంపిక చెయ్యడం పట్ల పొదిలి పట్టణంలోని పలువురు ప్రముఖులు పాత్రికేయులు అభినందించారు.