తహశీల్దారు కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం వద్ద సోమవారం నాడు అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐటియు నాయకులు రమేష్ మాట్లాడుతూ శాసనసభ జరిగే సందర్భంగా సెప్టెంబర్ 25వ తేదిన విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమానికి అంగన్వాడీ కార్యకర్తలు వెళ్లనీయకుండా ఎక్కడికి అక్కడ అంగన్వాడీ కార్యకర్తలను పోలీసు స్టేషన్ తీసుకొని అక్రమంగా నిర్బంధం చేసారని అందుకు నిరసనగా తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని ఆయన అన్నారు
ఇప్పటికైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ కార్యకర్తల జీతం పెంచాలని అదే విధంగా 2017 నుంచి రావాల్సిన టిఎ డిఎ లు ఇవ్వలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
అనంతరం స్థానిక పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు అశోక్ కుమార్ రెడ్డి అంగన్వాడీ కార్యకర్తలు వినతిపత్రాన్ని అందజేశారు
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ శోభారాణి, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.