అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా

ప్రకాశం జిల్లా పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం వద్ద శుక్రవారం నాడు అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా అంగన్వాడీ సంఘం నాయకురాలు శోభా మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న 11 వేలు జీతాన్ని 21 వేలకు పెంచాలని సగం జీతాన్ని పెన్షన్ గా ఇవ్వాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ మరియు అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు