8వ రోజుకు చేరిన అంగన్వాడీ కార్యకర్తల సమ్మె

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తలపెట్టిన సమ్మె ఎనిమిదవ రోజుకు చేరింది.

మంగళవారం నాడు స్ధానిక పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కార్యకర్తల‌‌ దీక్ష శిబిరం వద్ద ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు

ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు శోభా మాట్లాడుతూ తక్షణమే అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్ల పరిష్కారించాలని డిమాండ్ చేశారు

ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని ఆమె అన్నారు

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం రమేష్ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు