సోషల్ మీడియాలో మంత్రి అనిల్ యాదవ్ ను దూషించిన వారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖమంత్రి అనిల్ యాదవ్ ను దూషిస్తూ యాదవ జాతిని అవమాన పరిచిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు పిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే అఖిల భారత యాదవ మహాసభ జిల్లా నాయకులు పోల్లా నరసింహ యాదవ్ మూరబోయిన బాబురావు యాదవ్ ల సారధ్యంలో బుధవారంనాడు అఖిల భారత యాదవ మహాసభ పొదిలి మండల నాయకులు స్ధానిక పోలీసు స్టేషన్ నందు యస్ఐ సురేష్ కు ఫిర్యాదు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవుల మనోభావాలు దెబ్బతిసే విధంగా వ్యాఖ్యలు చేసిన సంబంధించిన వ్యక్తులపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని లేకపోతే ఉద్యమం తప్పదని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కనకం వెంకట్రావు, సన్నెబోయిన రాంబాబు, చాగంటి వెంకటేశ్వర్లు, పెమ్మని రాజు, పులగొర్ల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నా