అయ్యప్ప నిర్మమహేశ్వర ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కుందూరు
స్థానిక పొదిలి అయ్యప్పస్వామి మరియు నిర్మమహేశ్వర స్వామి దేవాలయాలలో మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే అయ్యప్పస్వామిని దర్శించుకుని అయ్యప్పమాల ధరించిన స్వాములకు దీక్షాకాలంలో ప్రత్యేకంగా శివాలయంలో ఏర్పాటు చేసే మధ్యాహ్న భోజన ప్రారంభ కార్యక్రమానికి హాజరుకావాలని మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డిని కలిసి పొదిలి అయ్యప్ప భక్త బృందం ఆహ్వానించగా…….. బుధవారంనాడు పొదిలి విచ్చేసిన కుందూరు నాగార్జునరెడ్డి అయ్యప్ప మరియు నిర్మమహేశ్వరస్వామి దేవస్థానాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అయ్యప్పమాల ధరించిన స్వాములకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అయ్యప్పమాల ధరించిన స్వాములు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.