మున్సిపల్ కార్మికులకు అన్నదానం
నగర పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులకు శనివారం నాడు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే గత వారం రోజులుగా నగర పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులు తమకు రావాల్సిన ఐదు నెలల జీతాలు చెల్లించాలని కోరుతూ వివిధ రకాల పద్దతి ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తు వస్తున్న విషయాన్ని గుర్తించిన పట్టణం చెందిన సీనియర్ సిటిజన్ మాకినేని రమణయ్య శనివారం నాడు స్థానిక నగర పంచాయతీ కార్యాలయం నందు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐటియు పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి యం రమేష్ మాట్లాడుతూ ఐదు నెలల జీతాలు చెల్లింపులు చేయకపోవడం ఆకలితో అల్లాడి పోతున్నారని వారి బాధలు చూసి నేడు అన్నదానం కార్యక్రమానికి దాతగా వ్యవహరించిన మాకినేని రమణయ్య కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పొదిలి నగర పంచాయితీ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, మాకినేని రమణయ్య తదితరులు పాల్గొన్నారు