ఆదిలక్ష్మిని వరించిన మరో పురస్కారం

పొదిలి పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త మరియు పారా లీగల్ వాలంటీర్ బోనిగల ఆదిలక్ష్మిని మరో పురస్కారం వరించింది.

వివరాల్లోకి వెళితే ఆదివారంనాడు ఒంగోలులోని ఫేస్ స్కూల్ నందు భరోసా పౌండేషన్ మరియు వివేకానంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో    ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పొదిలి పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త బొనిగల ఆదిలక్ష్మి చేసిన ఉత్తమ సేవలకు గాను ఉత్తమ సామాజిక కార్యకర్తగా ఎంపిక చేసి ప్రకాశంజిల్లా జైళ్ళశాఖ సూపరింటెండెంట్ ఐ హెచ్ ప్రకాశ్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించి ప్రశంశాపత్రం అందజేశారు.