పట్టణంలో మరో కోవిడ్ అనుమానిత కేసు నమోదు
పట్టణంలో మరో కోవిడ్ అనుమానిత కేసు నమోదు….. ఒంగోలు తరలింపు
పట్టణంలో మరో కోవిడ్ అనుమానిత కేసు నమోదయినట్లు అధికారులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే పట్టణంలో 3కోవిడ్ నిర్ధారణ కేసులు నమోదయిన నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు మంగళవారంనాడు కంభాలపాడు బెల్లంకొండ కాలేజిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ నందు 37మంది కోవిడ్ అనుమానిత వ్యక్తులకు ప్రాధమిక పరీక్షలు నిర్వహించగా…..
ప్రాధమిక పరీక్షలలో ఒకరికి కోవిడ్ పాజిటివ్ రావడంతో ఒంగోలుకు తరలించినట్లు మార్కాపురం నియోజకవర్గ కోవిడ్ ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరావు పొదిలి టైమ్స్ కు తెలిపారు.
ప్రజలు కరోనా బారిన పడకుండా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని… పోలీసులకు, అధికారులకు ప్రజలు సహకరించి నిర్ణిత సమయంలో మాత్రమే తమ అవసరాలకు బయటికి రావాలని….. బయటికి వచ్చేటప్పుడు మాస్కును ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తల తీసుకోవడం ద్వారా కరోనాను తరిమి కొట్టవచ్చని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉప్పలపాడు ప్రభుత్వ వైద్యాధికారి రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.