వ్యవసాయ శాఖ పథకాల గురించి అవగాహన

 

 

 

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

 

వ్యవసాయ శాఖ నందు అమలు అవుతున్న పథకాలు గురించి మండల వ్యవసాయ అధికారి షేక్ జైనులాబ్దిన్ అవగాహన కల్పించారు.

 

శుక్రవారం నాడు స్థానిక పొదిలి 3 రైతు భరోసా కేంద్రం నందు మండల వ్యవసాయ అధికారి షేక్ జైనులాబ్దిన్ అధ్యక్షతనతో జరిగిన అవగాహన సదస్సు లో ఆయన మాట్లాడుతూ సున్న ఒడ్డి రుణాలు , పంట బీమా, విత్తనాలు ఎరువులు పంపిణీ ,పొలం బడి మొదలైన కార్యక్రమాల గురించి అవగాహన కల్పించారు.

 

ఈ కార్యక్రమంలో రైతు భరోసా సిబ్బంది, మరియు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు