ఆటో బోల్తా ముగ్గురికి గాయాలు

ఆటో బోల్తాపడి ముగ్గురు గాయపడిన సంఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే మర్రిపూడి మండలం అంకేపల్లి నుండి పొదిలి వస్తున్న ఆటో స్ధానిక మర్రిపూడి క్రాస్ రోడ్డులోని బాపిష్టు పాలెం సమీపంలో అదుపుతప్పి బోల్తాపడడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురిలో బండి ఆదిలక్షమ్మ, జి కిరణ్ కుమార్ లు తీవ్రంగా గాయపడగా 10నెలల బాబుకు స్వల్పగాయాలు కావడంతో స్ధానికుల సమాచారంతో 108వాహనం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాధమిక చికిత్స అందించి అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు.