ఆటో బైక్ ఢీ యువకుడికి తీవ్ర గాయాలు
మర్రిపూడి రోడ్డులోని స్థానిక లారీ ఆఫీసు సమీపంలో ఆటో బైక్ ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. వివల్లోకి వెళితే పొదిలికి చెందిన రఫూఫ్ (35) పొదిలిలో స్థానికంగా పండ్లవ్యాపారి వద్ద 10 నిమిషాలలో వస్తానని బైక్ కావాలని అడగగా సదరు పండ్ల వ్యాపారి బైక్ ఇచ్చిన 5 నిమిషాల వ్యవధిలోనే బైక్ మరియు ఆటోలు పరస్పరం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో రఫూఫ్ తలకు చేతికి మరియు కాళ్లకు తీవ్ర గాయాలవ్వడంతో పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో ప్రాధమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు.